గుడ్ న్యూస్: మీ కరెంట్ బిల్ గూగుల్ పే ద్వారా చెల్లించొచ్చు

గుడ్ న్యూస్: మీ కరెంట్ బిల్ గూగుల్ పే ద్వారా చెల్లించొచ్చు

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై మీ కరెంట్ బిల్లులు ఇంటి దగ్గర నుంచే చెల్లించొచ్చు. ఎలా అంటే.. Google Pay  యాప్ తెలంగాణ లోని రెండు విద్యుత్ సంస్థలకు చెందిన బిల్లులను యాప్ ద్వారా చెల్లించేందుకు సేవలను ప్రారంభించింది. Google Pay యాప్ ద్వారా ప్రజలు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే వారి కరెంట్ బిల్లులను చెల్లించవచ్చు. 

తెలంగాణలోని వినియోగదారులకోసం Google Pay  చెల్లింపుల సేవలను విస్తరణలో భాగంగా ఈ సర్వీస్ ను అందిస్తోంది. తెలంగాణకు చెందిన రెండు ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ బిల్లర్లతో కలిసి పనిచేసేందుకు Google Pay ఒప్పందం కుదుర్చుకుంది. Google Pay యాప్ ద్వారా వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సులభంగా, సౌకర్యవంతంగా చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది Google Pay . 

Google Pay  యాప్ ఇప్పటికే భారత దేశం అంతటా  వినియోగదారులు చెల్లింపుకేంద్రాలకు వెళ్లకుండా విద్యుత్ బిల్లులను చెల్లించే సదుపాయం కల్పించింది. అయితే తెలంగాణలో ఇప్పటివరకు ఈ సౌకర్యం లేదు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ బిల్లర్లతో భాగస్వామ్యం కావడం ద్వారా చెల్లింపుల సేవ ప్రారంభించడంతో ఇప్పుడు భారత దేశం అంతటా విద్యుత్ బిల్లర్లకు 100 శాతం కవరేజ్ ని అందిస్తోంది Google Pay యాప్. 

Google Pay  ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడం ఎలా ? 

సింపుల్.. 

  • Google Pay  యాప్ ని ఓపెన్ చేసి Pay Bills  ను సెలక్ట్ చేసుకోవాలి 
  • Pay Bills లో Electricity ని సెలక్ట్ చేసుకోవాలి 
  • TSNPDCL or TSSPDCL లలో మీరు ఏ ఏజెన్సీకిందకు వస్తారో దానిని సెలక్ట్ చేసుకోవాలి
  • బిల్లు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయడానికి వినియోగదారు ఖాతాను లింక్ చేయాలి 
  • బిల్లు మొత్తాన్ని ఎంటర్ చేసి మీ UPI పిన్ ని ఉపయోగించి పేమెంట్ చేయాలి