ఎన్పీడీసీఎల్‌ సీఎండీ పదవికి గోపాల్‌ రావు రాజీనామా

ఎన్పీడీసీఎల్‌ సీఎండీ పదవికి గోపాల్‌ రావు రాజీనామా

ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్‌) చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ A. గోపాల్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. గురువారం (డిసెంబర్ 7న) తన రాజీనామా పత్రాన్ని ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన వారందరికి గోపాల్‌ రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్పీడీసీఎల్ ఇక ముందు కూడా మరింత అభివృద్ధి సాధించాలని గోపాల్‌ రావు  ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు ఇంతకుముందే రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ , పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో పని చేస్తామని ప్రకటించారు.