మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనిచ్చిన ఎన్‌పీపీ ఎంపీ

మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టతనిచ్చిన ఎన్‌పీపీ ఎంపీ

మేఘాలయలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే  ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు.  సీఎం కాన్రాడ్‌ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ 15, తృణమూల్‌ కాంగ్రెస్‌ 15 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇతరులు 16 స్థానాల్లో, భాజపా 6, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.  మ్యాజిక్ ఫిగర్ కు 31 స్థానాలు అవసరం. ప్రస్తుతం మేఘాలయలో హంగ్ అసెంబ్లీని సూచిస్తుండటంతో బీజేపీతో జట్టు కడతామనే సంకేతాలను అధికార ఎన్‌పీపీ పంపిస్తోంది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వన్వీరోయ్ ఖర్లుఖి మాట్లాడుతూ ఇది బీజేపీ, ఎన్‌పీపీ కూటమికి లభించిన ప్రజా తీర్పు అని అన్నారు.  ఎన్‌పిపి ఎప్పుడూ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడదంటూ ఆయన  కామెంట్ చేశారు. కాగా మేఘాలయలో ఎన్నికల ముందు సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న బీజేపీ, ఎన్ పీపీ ఈ ఎన్నికల్లో మాత్రం  విడివిడిగా పోటీ చేశాయి.