
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‌కు భారత్ రివేంజ్ తీర్చుకుంది. 26 మంది అమాయక ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులపై విరుచుకుపడింది. 2025, మే 6 మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఈ కౌంటర్ ఎటాక్‌లో లష్కరే తోయిబా, జైషీ మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు.
ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ గురించి వివిధ దేశాలకు చెందిన భద్రతా సలహాదారులతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యూకే ఎన్ఎస్ఏ జోనాథన్ పావెల్, సౌదీ ఎన్ఎస్ఏ ముసైద్ అల్ ఐబాన్, యూఏఈ ఎన్ఎస్ఏ షేక్ తహ్నూన్, యూఏఈ ఎన్ఎస్సీ సెక్రటరీ జనరల్ అలీ అల్ షమ్సీ, జపాన్ ఎన్ఎస్ఏ మసటకా ఒకానో, సీపీసీ సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, పీఆర్సీ విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ బోన్ యొక్క దౌత్య సలహాదారు, రష్యన్ ఎన్ఎస్ఏ సెర్గీ షోయిగుతో బుధవారం (మే 7) అజిత్ దోవల్ ఫోన్లో మాట్లాడారు.
►ALSO READ | ఇదిగో కుట్రకు సాక్ష్యం..ఉగ్రవాది మొఘల్కు అంత్యక్రియలు నిర్వహించిన ISI, పాక్ పోలీసులు
ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి వారికి వివరించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తీసుకున్న చర్యలు, దాని అమలు విధానం గురించి వాళ్లకు చెప్పారు. పహల్గాంలో ఉగ్రదాడికి కౌంటర్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే ఆలోచన భారత్‌కు లేదని చెప్పిన అజిత్ దోవల్.. పాక్ రెచ్చగొడితే మాత్రం దానికి ధీటుగా తప్పకుండా బదులిస్తామని ప్రపంచదేశాలకు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భవిష్యత్ లోనూ మా మిత్ర దేశాలతో సమాచారం పంచుకుంటామని ఆయన పేర్కొన్నారు.