ఇదిగో కుట్రకు సాక్ష్యం..ఉగ్రవాది మొఘల్కు అంత్యక్రియలు నిర్వహించిన ISI, పాక్ పోలీసులు

ఇదిగో కుట్రకు సాక్ష్యం..ఉగ్రవాది మొఘల్కు అంత్యక్రియలు నిర్వహించిన ISI, పాక్ పోలీసులు

దాయాది దేశం పాకిస్థాన్ కుట్రకు ఇదిగో సాక్ష్యం..ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తానే అంటున్న భారత్ అనుమానాలకు ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం. మేం ఉగ్రవాదాన్ని మేం పోషించడం లేదు.. మాకేం సంబంధం లేదు అంటున్న పాక్ కల్లబొల్లి  మాటలు నిజం కాదని తేలిపోయింది. చేసేదంతా చేస్తూనే ఐక్యరాజ్యసమితిలో కూడా తామే అమాయకులం అని నమ్మబలికేందుకు ప్రయత్నించినా అక్కడ కూడా ప్రపంచ దేశాలు పాక్ అబ్ధాలను నమ్మలేదు. తాజాగా ఉగ్రవాది యాకుబ్ మొఘల్ అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది తామే పాక్ స్వయంగా బయటపెట్టుకుంది. 

దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రకుట్రకు ఇదిగో సాక్ష్యం. పాక్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న టెర్రరిస్టు యాకుబ్ మొఘల్ అంత్యక్రియలకు ISI, పాకిస్థాన్ పోలీసులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా బిలాల్ టెర్రర్ క్యాంపుపై భారత సాయుధ దళాలు జరిపిన క్షిపణి దాడులలో మొఘల్ హతమయ్యాడు.మొఘల్ అంత్యక్రియలకు ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సభ్యులు, పాకిస్తాన్ పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)తో సహా పాకిస్తాన్ గడ్డపై బుధవారం తెల్లవారుజామును భారత్ వైమానిక దళం జరిపిన మెరుపు దాడిలో నేలమట్టం అయిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలలో మొఘల్ బిలాల్ శిబిరం ఒకటి. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిపింది భారత సైన్యం. పహల్గాం దాడిలో 26 మంది అమాయక హిందూ పర్యాటకులు ముఖ్యంగా పురుషులను మతం అడిగీ మరీ కాల్చి చంపారు టెర్రరిస్టులు. 

ISI కార్యకర్తలు ,పాక్ పోలీసు అధికారులు యాకుబ్ మొఘల్ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడం పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే అనుమానాలను నిజం చేస్తుందని భారత్ అధికారులు అంటున్నారు. పాకిస్తాన్ సరిహద్దు లోపల, బయట పనిచస్తున్న జీహాదిస్ట్ గ్రూపులకు రహస్యంగా  మద్దతు ఇస్తుందనడానికి ఇది సాక్ష్యం.. పాక్ ఉగ్రవాద కుట్రకు ఇది మరింత నిర్ధారణ చేస్తుందన్నారు. 

►ALSO READ | భారత్-పాక్ సంయమనం పాటించాలి: ఆపరేషన్ సిందూర్‎పై రష్యా రియాక్షన్

భారత్ జరిపిన వైమానిక దాడుల్లో బహవల్పూర్ లోని జైష్ ఏ మహ్మద్ ( JeM) కీలక స్థావరాలపై పూర్తిగా నేలమట్టమయ్యాయి.  JeM సంస్థ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మసీదు సుభాన్ అల్లాహ్ పై జరిపిన దాడుల్లో JeM చీఫ్ మౌలానా మసూద్ అజార్ అక్కతో సహా అతని కుటుంబానికి చెందిన 10మంది చనిపోయారు.  

భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వ్యూహాత్మక ,ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పేరు వితంతువు మహిళల ప్రతిరూపాన్ని గుర్తుకు తెస్తుంది. -పహల్గాం ఊచకోతలో భార్యలముందే వారి భర్తల ఉసురు తీసిన గాయాన్ని గుర్తుచేస్తుంది.