
జ్యోతినగర్, వెలుగు : రామగుండం ఎన్‌టీపీసీ ప్రాజెక్ట్ నాలుగు రోజుల ముందే విద్యుత్ ఉత్పత్తి టార్గెట్‌ను చేరుకుంది. 2023–24 సంవత్సరానికి సంబంధించి ఈ నెల 31 వరకు 16,598.37 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని టార్గెట్‌గా పెట్టుకోగా, బుధవారం వరకు 16,645 మిలియన్ల యూనిట్లను ఉత్పత్తి చేసింది. అనేక టెక్నికల్ సమస్యలు ఎదురైనా టార్గెట్ చేరుకోవడం పట్ల ఉద్యోగులు, ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.