నొప్పితో ఇబ్బంది పడుతూనే.. కాంతార 1 ఈవెంట్కు ఎన్టీఆర్..

నొప్పితో ఇబ్బంది పడుతూనే.. కాంతార 1 ఈవెంట్కు ఎన్టీఆర్..

యాడ్ షూటింగ్ లో గాయపడిన ఎన్టీఆర్.. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత బయటికి వచ్చారు. ఆదివారం (సెప్టెంబర్ 28) హైదరాబాద్ లో రిషభ్ శెట్టి మూవీ కాంతార ఛాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. గాయం తర్వాత అమ అభిమాన నటుడు పాల్గొంటున్న ఈవెంట్ కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలివచ్చారు. 

రిషభ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన కాంతార ఛాప్టర్ 1 ప్రి రిలీజ్ ఈవెంట్ కు.. గాయంతోనే వచ్చిన ఎన్టీఆర్ ఈవెంట్ లో కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించారు. కూర్చుంటున్నపుడు గాయం పట్టుకుని నొప్పి వస్తున్నట్లుగా ఎన్టీఆర్ బాధపడుతున్న క్షణం.. ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేసింది. స్పీచ్ ఇచ్చేందుకు వెళ్తున్నపుడు కూడా గాయాన్ని పట్టుకుంటూ ఇబ్బందిగానే వెళ్లారు. 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. గాయం కారణంగా గట్టిగా మాట్లాడలేక పోతున్నా.. అభిమానులు కాస్త ఓపికగా వింటే మాట్లాడాల్సింది త్వరగా మాట్లాడతా.. అంటూ మెల్లిగా మాట్లాడి తక్కువ సమయంలోనే స్పీచ్ ముగించారు.  చిన్నప్పుడు అమ్మమ్మ కుందాపుర సమీపంలోనే మన ఊరు ఉందని.. దానికి సంబంధించిన కథలు చెప్పేది. అవన్నీ నాకు నచ్చేవి. ‘ఇలా నిజంగానే జరుగుతుందా?’ అని నాకెన్నో సందేహాలొచ్చేవి. నేను విన్న ఆ కథలతో ఓ దర్శకుడు సినిమా తెరకెక్కిస్తాడని అనుకోలేదు. నా సోదరుడు రిషబ్‌శెట్టి దాన్ని సాధ్యం చేశాడు అని అన్నారు.

2022లో తక్కువ బడ్జెట్ తో వచ్చిన కాంతార దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార ఛాప్టర్ 1 పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 02న థియేటర్లలో విడుదల అవుతుంది.