ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో కంప్లీట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఓ యాడ్ షూట్‌లో భాగంగా ఎన్టీఆర్‌కు గాయాలవడంతో ఈ మూవీ షూటింగ్‌కు కొన్నాళ్లుగా బ్రేక్ వచ్చింది. తాజాగా శనివారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తున్నారు.
కొంత గ్యాప్ తర్వాత రూపొందిస్తున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతోపాటు ఒక పాటను చిత్రీకరించనున్నారు. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో దాదాపు ఇరవై రోజులు ఈ షెడ్యూల్ సాగనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. మునుపెన్నడూ లేనంత సన్నగా మారి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 31వ చిత్రం. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టోవినోథామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జూన్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ షూటింగ్‌కు గ్యాప్ రావడంతో వచ్చే ఏడాది ఎండింగ్‌లో రిలీజ్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ‘డ్రాగన్’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.

