
హైదరాబాద్, వెలుగు: సందర్శకుల తో సెక్యూరిటీ దురుసు ప్రవర్తన, పా ర్కు ఎంట్రీ ఫీజు ఎక్కువగా వసూలు చేస్తున్నారని తేలడంతో ఎన్టీఆర్ గార్డెన్ నిర్వాహకులకు రూ. 2,500 ఫైన్ వేశారు. దీనిపై ఇక్బాల్ హుస్సేన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, మున్సిపల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్కు ట్వీట్ చేశాడు. విచారించిన హెచ్ఎండీఏ అధికారులు పైవిధంగా చర్యలు తీసుకున్నారు. మంగళవారం బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్(బీపీసీ) ఓఎస్డీ చంద్రారెడ్డి ఎన్టీఆర్ గార్డెన్ సందర్శించి, ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఇక్బాల్ హుస్సేన్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొని ఘటనపై విచారించారు. మహిళ సెక్యూరిటీ సిబ్బంది తో పాటు క్లాక్ రూమ్ లోని ఇద్దరు వ్యక్తులను తొలగించారు.
పార్కు నిర్వాహకులకు ఫైన్ వేశారు. ఎన్టీఆర్ గార్డెన్ క్లాక్ రూమ్ ఘటనపై నిర్లక్ష్యంగా ఉన్న అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.