సర్ ప్రైజ్.. మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్

సర్ ప్రైజ్.. మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్

కౌన్ బనేగా కరోడ్ పతి, బిగ్ బాస్ లాంటి టీవీ షోస్ స్టార్ హీరోల్ని ప్రేక్షకులకి మరింత దగ్గర చేశాయి. ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్‌‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ కూడా తనదైన టైమింగ్‌‌తో షోని ఎంటర్‌ టైనింగ్‌‌గా నిర్వహించి మంచి హోస్ట్‌‌ అనిపించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్‌‌లో కనిపించని తారక్, త్వరలో మరోసారి బుల్లితెరపై
మెరవబోతున్నట్టు తెలుస్తోంది. కౌన్ బనేగా కరోడ్ పతి తరహాలో సాగే ఒక షోని ఎన్టీఆర్‌ తో ప్లాన్‌‌ చేసిందట ఓ ప్రముఖ చానల్. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రచారంలో ఉంది తప్ప ఈ టీవీ షోపై ఇంకా అధికారిక ప్రకటనైతే రాలేదు. ప్రస్తుతానికైతే రాజమౌళి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్‌‌ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే విడుదలైన టీజర్‌ లో కొమురం భీమ్‌‌గా తన లుక్‌‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో తారక్‌‌ ఓల్డ్‌ మేన్‌‌ గెటప్‌ లో కూడా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఈ వెరైటీ లుక్‌‌ని థియేటర్‌ లో చూపించి సర్‌ ప్రైజ్ చేసేందుకుగాను సీక్రెట్‌ గా ఉంచారంటూ వార్తలొస్తున్నాయి . దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌‌లో నటించనున్నాడు తారక్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఉంది. మరి టీవీ షోకి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తాడో!