ఎన్టీఆర్-నీల్ 'డ్రాగన్' మూవీ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్!

ఎన్టీఆర్-నీల్ 'డ్రాగన్' మూవీ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' డ్రాగన్'( #NTRNeel). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై  ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, తారక్ లుక్ విషయంలో దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడని వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. లెటేస్ట్ గా ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

ఆ పుకార్లలో నిజం లేదు..

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ కోసం కొత్త లుక్స్ ట్రై చేస్తున్నారని, కానీ ఆ లుక్ సరిగ్గా కుదరకపోవడంతో షూటింగ్ షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపివేశారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన నిర్మాణ సంస్థ, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రూమర్లకు చెక్ పెట్టింది. ఈ సినిమా లుక్ గురించి లేదా షూటింగ్ రద్దు గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. సినిమా పనులు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి. ప్రస్తుతం కేవలం సాధారణ ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే ఉంది. ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి, వ్యాప్తి చేయకండి. అధికారిక అప్‌డేట్స్ మా నుంచే వస్తాయి అని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది.

డ్రాగన్.. ఒక భారీ ప్రయోగం!

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత అందిస్తున్నారు. ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు బడ్జెట్ పరిమితులు లేవని, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో దీనిని రూపొందిస్తున్నారని తెలుస్తోంది.  ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ఎప్పుడుంటే?

మరో వైపు జూ. ఎన్టీఆర్  పుట్టిన రోజు సందర్భంగా మే 20న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 9, 2025న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం, జూన్ 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేసే విధానం చాలా వైల్డ్‌గా ఉంటుంది. మరి ఈ సినిమాలో తారక్‌ను ఏ రేంజ్ మాస్ అవతారంలో చూపిస్తారో చూడాలి. మొత్తానికి 'నిలిచిపోయింది' అన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడటంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.