బీజేపీ అప్లికేషన్లు పెరుగుతున్నయ్.. మూడో రోజు 306

బీజేపీ అప్లికేషన్లు పెరుగుతున్నయ్..  మూడో రోజు 306

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. బుధవారం 306 మంది లీడర్లు వివిధ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. చొప్పదండి నుంచి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, గోషామహల్ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్, ఖైరతాబాద్ నుంచి మాజీ ప్రధాని పీవీ మనువడు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్, మహేశ్వరం నుంచి అందె శ్రీరాములు అప్లికేషన్లు అందజేశారు.  మీసాల చంద్రయ్య ఉప్పల్ నుంచి, ఉమా మహేశ్వర్ చార్మినార్ నుంచి, జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు నవజీవన్ రెడ్డి, నర్సింహరావు ఎల్బీనగర్​ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులు సమర్పించారు. మూడు రోజుల్లో మొత్తం 666 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లు అందజేసేందుకు 10వ తేదీ దాకా గడువు ఉంది. 

ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందే: జవదేకర్

పార్టీలో ఎంత పెద్ద లీడర్ అయినా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే అని రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ విషయాన్ని తన తరఫున అందరికీ తెలియజేయాల్సిందిగా కమిటీ సభ్యులకు తెలియజేశారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన అప్లికేషన్ల కౌంటర్​ను ఆయన పరిశీలించారు. ఇప్పటి దాకా వచ్చిన అప్లికేషన్లు, ప్రముఖులు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారన్న విషయాలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అప్లికేషన్లు ఇవ్వలేదని కమిటీ సభ్యుడు దాసరి మల్లేశం ప్రకాశ్ జవదేకర్​కు వివరించారు.