ఆడబిడ్డకు జన్మనిచ్చి..కరోనాతో చనిపోయిన నర్సు

ఆడబిడ్డకు జన్మనిచ్చి..కరోనాతో చనిపోయిన నర్సు
  • నార్త్‌లండన్‌లోని హాస్పిటల్‌లో ఘటన
  • క్వారంటైన్‌లో పాప, తండ్రి

లండన్‌: నెలలు నిండినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన నర్సును కరోనా మింగేసింది. దీంతో కనీసం ఆమె బిడ్డను ముట్టుకోకుండా లోకం విడిచి వెళ్లిపోయేలా చేసింది. ఐదు రోజులకే తల్లిని పోగొట్టుకున్న ఆ బిడ్డను కూడా14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేలా చేసింది మహమ్మారి కరోనా. నార్త్‌ లండన్‌లోని లూటన్‌ అండ్‌ డన్‌స్టాబుల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌లో జరిగిన ఈ ఘటన అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది. మారే అగ్యివా అగ్యాపాంగ్‌ అనే మహిళ నార్త్‌లండన్‌లోని హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. కడుపుతో ఉన్నా.. నెలలు నిండినా డ్యూటీకి వస్తూ కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ అందించింది. కాగా.. ఈ నెల 5న మేరీకి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమెను హాస్పిటల్‌లో చేర్పించగా.. ఆమెకు ఆడపిల్ల పుట్టింది. పాప పుట్టిన ఐదు రోజులకే మేరీ చనిపోయింది. “ ఈ నెల 5న మేరీకి కరోనా పాజిటివ్‌ రావడంతో హాస్పిటల్‌లో చేరింది. వెంటనే ఆపరేషన్‌ చేశాం. ఆడపిల్ల పుట్టింది. పాప పుట్టిన ఐదు రోజులకే ఆమె చనిపోయింది. కానీ పాప మాత్రం ఆరోగ్యంగా ఉంది. ఆమె భర్త, పాపకు కరోనా ఉందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. వాళ్లిదర్నీ 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాం” అని హాస్పిటల్‌ అధికారులు చెప్పారు. కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్న మెడికల్‌ స్టాఫ్‌కు సరైన ఎక్విప్‌మెంట్‌ ఇవ్వడం లేదని అందుకే డాక్టర్లు నర్సులు చనిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మేరీతో సహా యూకేలో ఇప్పటి వరకు 47 మంది నర్సులు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.