క్లాసుల కోసం వస్తే.. కరోనా వార్డుల్లో డ్యూటీ చేయిస్తున్రు

క్లాసుల కోసం వస్తే.. కరోనా వార్డుల్లో డ్యూటీ చేయిస్తున్రు
  •     నర్సింగ్ స్టూడెంట్స్ ను  పరేషాన్ చేస్తున్న కాలేజీలు 
  •      కరోనా బారిన పడుతున్నామంటూ ఆవేదన

హైదరాబాద్, వెలుగుకరోనా ఎఫెక్ట్ ఇంకా డేంజర్ గానే ఉన్నప్పటికీ కొన్ని నర్సింగ్ కాలేజ్ లు స్టూడెంట్స్ ను పరేషాన్ చేస్తున్నాయి. క్లాసుల పేరుతో వాళ్లను కాలేజ్ కు రమ్మని పిలిచి కరోనా వార్డులో డ్యూటీ లు చేయిస్తున్నాయి. వార్డ్ బాయ్స్, స్టాఫ్ చేయాల్సిన పనులను కూడా వీరికే అప్పగించేస్తున్నాయి. లేదంటే బెదిరింపులకు దిగుతున్నాయి. ఒక్కో షిప్ట్ లో 8 గంటలకు పైగా వారిని కరోనా వార్డులోనే ఉంచుతున్నాయి. దీంతో నర్సింగ్ కాలేజ్ లో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. క్లాసులు చెబుతామంటూ పిలిచి ఇదేం చాకిరీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

కరోనా బారిన పడుతున్న స్టూడెంట్స్

కరోనా వార్డులో  డ్యూటీలు చేస్తున్న చాలా మంది స్టూడెంట్స్ వైరస్ బారిన పడుతున్నారు. డ్యూటీలో ఉంటున్న వారిలో సగానికి పైగా స్టూడెంట్స్ కు కరోనా సోకుతుంది. అయినా వీరిని పట్టించుకునే వారే లేరు. సిటీలో నర్సింగ్ కోర్సులు చేసే చాలా మంది ఇతర రాష్ట్రాల వారే. వీరిని ఆగస్టులోనే కాలేజ్ లకు రావాలంటూ కాలేజ్ మేనేజ్ మెంట్లు ఫోన్లు చేసి రప్పించాయి. క్లాసులు మిస్ అవ్వద్దన్న ఉద్దేశంతో చాలా మంది స్టూడెంట్స్ కు రిస్క్ చేసి వచ్చారు. వీరికి అకామిడేషన్ సమస్యగా మారింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో,  పెయింగ్ గెస్ట్ గా ఉంటూ మొదట్లో క్లాసులకు అటెండ్ అయ్యారు. ఐతే వీరిని కరోనా వార్డులలో డ్యూటీ చేయిస్తున్నారని తెలియటంతో హాస్టల్స్, పెయింగ్ గెస్ట్ రూమ్ లలోనూ ఉండనిస్తలేరు. దీంతో ఎక్కడ ఉండాలో తెలుస్తలేదని చెప్తుతున్నారు. చాలా మెడికల్ కాలేజ్ ల హాస్పిటల్స్ లో కరోనా వార్డులో పనిచేసేందుకు వార్డ్ బాయ్ లు, ఇతర స్టాఫ్ ముందుకు రావటం లేదు. దీంతో వారి పనిని కూడా అకడమిక్ పేరుతో నర్సింగ్ స్టూడెంట్స్ తో చేయిస్తున్నారు.

 రూల్స్ పట్టంచుకోవట్లే..

వేరే రాష్ట్రాల నుంచి సిటీకి వచ్చిన నర్సింగ్ స్టూడెంట్స్ విషయంలో మొదట కేర్ తీసుకున్నాయి.  స్క్రీనింగ్, కరోనా టెస్ట్ లు చేశాయి.  క్వారంటైన్ పిరియడ్ అయ్యాక రావాలని కోరారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. స్టూడెంట్స్ సేప్టీని గాలికి వదిలేశారు. వారికి థర్మల్ టెస్ట్ లు, పీపీఈ కిట్ల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. కరోనా సోకిన నర్స్ లు అదే హాస్పిటల్స్ లో చేరినా వారికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వటం లేదు. షిప్ట్ ల వారీగా స్టూడెంట్స్ కరోనా వార్డులలో డ్యూటీలో వేస్తూనే ప్రాజెక్ట్ వర్క్స్ కూడా పూర్తి చేయాలంటూ ప్రెజర్ పెడుతున్నారని కొంతమంది స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వార్డులలో పనిచేస్తున్న సంగతి గానీ వైరస్ సోకిన గానీ ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పాలంటే భయంగా ఉందంటున్నారు.

ఫస్ట్ నాకే అటాక్

మాది గుంటూరు. కరోనా వార్డులో డ్యూటీ వేసిన పది రోజుల్లోనే వైరస్ అటాక్ అయ్యింది. మా కాలేజ్ లో నాకే ఫస్ట్   వచ్చిం ది.  ఇష్టం లేకపోయినా బల వంతంగా కరోనా వార్డులో డ్యూటీ వేస్తున్నారు. ఎదురు చెబితే భయపెడు తున్నారు. చదువు కోసం రిస్క్ అయినా కరోనా వార్డులో డ్యూటీ చేస్తున్నాం. నాలాగే చాలా మంది కరోనా వచ్చింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
– మధు, నర్సింగ్ స్టూడెంట్

భయంగా ఉంది

మాది జైపూర్. ఫిలింనగర్ లో ఉంటూ  నర్సింగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నా. లాక్ డౌన్ తర్వాత ఆగస్టు లో రమ్మని పిలిస్తే వచ్చాను. నెల నుంచి కరోనా వార్డులో డ్యూటీ వేస్తున్నారు. నాలు గు రోజులుగా జ్వరంగా ఉంటే టెస్ట్ చేయిం చా. కరోనా పాజిటివ్. నాతో పాటు రూమ్ లో నలుగురు ఉంటారు. దీంతో హాస్టల్ నుంచి హాస్పిటల్ కు షిఫ్ట్ అయ్యాను. ఇంట్లో వాళ్లకి చెప్పలేదు. భయంగా ఉంది.
– రాధ, నర్సింగ్ స్టూడెంట్