
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. షూటింగ్ చివరిదశలో ఉండటంతో తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రామ్ లిరిక్స్ రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాడటం హైలైట్‌గా నిలిచింది. వివేక్, మెర్విన్ సాంగ్ కంపోజ్ చేశారు.
‘నువ్వుంటే చాలే.. మాటలతో చెప్పమంటే చెప్పలేనే.. భావమేదో భాషలకే అందనందే.. అదేమిటో కుదురుగా ఉండనీదే.. అడిగితే అదేమిటో అర్ధంకాదే.. నిన్న మొన్న నాలో ఉన్న నేనే కాదే.. పుట్టిందంటే నీతో తప్ప పోనేపోదే ప్రేమంతే..’ అంటూ సాగిన ఈ రొమాంటిక్ సాంగ్‌లో రామ్, భాగ్యశ్రీ వింటేజ్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. రాజమండ్రి గోదావరి తీర ప్రాంతంలోని రియల్ లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించడం స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తుండగా, రావు రమేష్, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.