
తెలంగాణ ప్రభుత్వం ఏడేళ్ళ పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండం అన్నారు ఎన్వీఎస్ ప్రభాకర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే.. కేటీఆర్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఓవైసీ, కేటీఆర్ లు ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం పనిచేస్తోంటే.. మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు వాణీదేవి గెలుపు కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వటం ఖాయమన్నారు. ఏమి చెప్పి ఓట్లడగాలో టీఆర్ఎస్ పెద్దలకు అర్థం కావటం లేదన్నారు ప్రభాకర్. టీఆర్ఎస్ లో గందరగోళం నెలకొందని.. రాంచందర్ రావు చర్చలకు రమ్మంటే కేటీఆర్ పారిపోయాడన్నారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉన్న కెటిఆర్ ,అడ్వకేట్ ల హత్య జరిగిన తర్వాతనైన వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు పరామర్శ కు ఎందుకు వెళ్ళలేదు.