ఇండియా ఇంటికే: కివీస్ పై అఫ్గాన్‌ ఓటమి

V6 Velugu Posted on Nov 07, 2021

అబుధాబి:   T20 WC-2021లో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇవాళ అఫ్ఘనిస్ధాన్  పై న్యూజిలాండ్ విక్టరీతో భారత్ సెమీస్ రేసు నుంచి ఔట్ అయ్యింది. తర్వాతి మ్యాచ్ లో నమీబియాతో గెలిచినా లాభం లేదు. గ్రూపు-1 నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా,..గ్రైప్ -2 నుంచి పాక్, కివీస్ సెమీస్ కి వెళ్లాయి. ఇవాళ్టి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్‌పై కివీస్ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. 

125 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిల్యాండ్‌కు మార్టిన్ గప్తిల్‌ (28), డారియల్ మిచెల్‌ (17) శుభారంభం అందించారు. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌ (40 నాటౌట్‌), డెవాన్‌ కాన్వే (36 నాటౌట్‌) ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, రషీద్‌ ఖాన్ చెరో వికెట్ కూల్చారు. ఈ విజయంతో సెమీస్ చేరాలనే టీమిండియా ఆశలు కూడా ఆవిరయ్యాయి. సోమవారం జరిగే నామమాత్రపు మ్యాచ్‌లో నమీబియాతో టీమిండియా తలపడనుంది.


 

Tagged India, , NZ vs AFGT, 20 World Cup

Latest Videos

Subscribe Now

More News