35 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని పోరాటం.. చరిత్ర సృష్టించిన కివీస్‌ పేసర్‌

35 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని పోరాటం.. చరిత్ర సృష్టించిన కివీస్‌ పేసర్‌

న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్‌ టిమ్‌ సౌతీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. 35 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీపడుతున్న ఈ పేసర్.. దేశం కోసం అలుపెరుగని సైనికుడిలా పోరాడుతున్నాడు. డబ్బుపై వ్యామోహంతో సహచర ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటున్నా.. తాను మాత్రం దేశానికి ఆడటానికే అధిక ప్రాధాన్యమిస్తున్నాడు. సౌతీ.. శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో ఓ మైలురాయిని చేరుకున్నాడు.  

ఒకే ఒక్కడు

నాలుగు వికెట్లతో పాక్ ఓటమిని శాసించిన సౌతీ.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరులు

  • 1. టిమ్ సౌథీ (న్యూజిలాండ్): 118 మ్యాచ్‌ల్లో 151 వికెట్లు
  • 2. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్): 117 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు
  • 3. రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్): 82 మ్యాచ్‌ల్లో 130 వికెట్లు
  • 4. ఇష్ సోధి (న్యూజిలాండ్): 106 మ్యాచ్‌ల్లో 127 వికెట్లు
  • 5. లసిత్ మలింగ (శ్రీలంక) - 84 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత న్యూజిలాండ్ 226 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో పాక్ 180కే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.