ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌    

ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌    

టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్‌.. ఒలింపిక్స్‌లో పోటీ చేయనున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ కానున్నారు. ఆ దేశ మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం ఆమెను ఎంపిక చేశారు. ట్రాన్స్‌జెండర్‌గా మారకముందు ఆమె 2013లో మెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొంది. అయితే హబ్బర్డ్ ఎంపిక పట్ల వివాదం చెలరేగుతోంది. మహిళ జట్టుకు లారెల్‌ను ఎంపిక చేయడంతో ఆమెకు ఎక్కవ అడ్వాంటేజ్ ఉంటుందని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం ట్రాన్స్‌జెండర్ల సంఖ్యను పెంచాలంటున్నారు. న్యూజిలాండ్ ప్రజలు ఇచ్చిన మద్దతుకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. మహిళల 87 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో లారెల్ పోటీ చేయనున్నారు.

2015లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తన రూల్స్‌ను మార్చింది. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళల కేటగిరీలో పోటీ చేయవచ్చు అని తెలిపింది. టెస్టెస్టరోన్ హార్మోన్లు తక్కువగా ఉన్నవారు ఆ క్యాటగిరీలో పోటీ చేసే వీలు ఉంటుంది. దీంతో 43 ఏళ్ల లారెల్ మొదటి సారి ట్రాన్స్‌జెండర్ కోటాలో ఒలింపిక్స్‌కు ఎంపికైన అథ్లెట్‌గా నిలిచారు.