కింగ్ కోఠిలో ఆక్రమణల తొలగింపు

కింగ్ కోఠిలో ఆక్రమణల తొలగింపు

బషీర్​బాగ్, వెలుగు: కింగ్​ కోఠిలో ఫుట్ పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. సెకండ్ హ్యాండ్ టూవీలర్స్ షాప్ యజమానులు ఫుట్ పాత్ ను ఆక్రమించి వాహనాలు అక్కడే పెడుతుండడంతో ట్రాఫిక్ తిప్పలతోపాటు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నోటీసులు ఇచ్చినా షాపు యజమానులు పట్టించుకోలేదు. దీంతో ఫుట్ పాత్ ఆక్రమణలను జేసీబీ సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం తొలగించారు.