పార్కును కబ్జా చేసి.. గోడ కడుతున్నరు

పార్కును కబ్జా చేసి.. గోడ కడుతున్నరు

హైదరాబాద్, వెలుగు: అల్వాల్ లోని పాకాలకుంటలో పార్కు భూములను పరిరక్షించాలంటూ కాలనీవాసులు జీహెచ్ఎంసీ అధికారులకు కంప్లయింట్​చేశారు. సర్వే నెం. 569, 570, 571లోని భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేసి గోడలు కడుతున్నారని, వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మూడేళ్లుగా స్థానిక బల్దియా అధికారులకు కంప్లయింట్లు చేస్తున్నా స్పందించట్లేదని ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉండే కొందరు అధికార పార్టీ నేతలు పార్కు భూములను కబ్జా చేసినట్లుగా ప్రగతిశీల్​ వెల్ఫేర్​ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి లే అవుట్ లో పేర్కొన్న పార్కు భూమిని కాపాడి, అక్రమంగా నిర్మించిన గోడను తొలగించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి 

గ్రేటర్‌లో డీపీఎంఎస్ సేవలకు త్వరలో పుల్‌స్టాప్

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్    

చెరువుల కబ్జాలపై ఏం చేశారో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండిf

పెట్రోల్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన