ఒడిశా గిరిజన నేత ఓరమ్​కు మోదీ కేబినెట్ లో చోటు

ఒడిశా గిరిజన నేత ఓరమ్​కు మోదీ కేబినెట్ లో చోటు

భువనేశ్వర్ :  ఒడిశా గిరిజన నేత, బీజేపీ లీడర్  జువాల్  ఓరమ్ కూ ఈ సారి మోదీ 3.0 కేబినెట్ లో చోటు లభించింది. ఒడిశాలోని సుందర్ గఢ్ కు చెందిన ఓరమ్.. ఆదివారం కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. మాజీ ప్రధాని అటల్  బిహారీ వాజ్ పేయి హయాంలో గిరిజన వ్యవహారాల శాఖ ప్రవేశపెట్టినపుడు ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దేశ మొట్టమొదటి గిరిజన నేతగా ఆయన రికార్డు సృష్టించారు. 

ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన సుదీర్ఘ ప్రయాణం. సుందర్ గఢ్  నుంచి ఆరుసార్లు లోక్ సభకు ఆయన ఎన్నికయ్యారు. అలాగే బీజేపీ ఒడిశా ప్రెసిడెంట్ గానూ మూడుసార్లు పనిచేశారు. 2014లో ఒడిశాలోని మొత్తం 21 లోక్ సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులు ఓడిపోగా.. ఓరమ్  ఒక్కడే గెలిచాడు. అప్పుడు బీజేడీ అభ్యర్థి, హాకీ మాజీ కెప్టెన్  దిలీప్  టిర్కీని ఓడించారు. ఇప్పుడు కూడా సుందర్ గఢ్​లో అదే అభ్యర్థిని ఓరమ్  ఓడించారు.