పృథ్విరాజ్ సుకుమారన్, మంజు వారియర్ లీడ్ రోల్స్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఒడియన్’. ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్ అనేది క్యాప్షన్. రాహుల్ సదాశివన్ దర్శకుడు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ చిత్రంతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హీరో పృథ్విరాజ్ సుకుమారన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంగళవారం ఈ మూవీని అనౌన్స్ చేశారు. రూపాన్ని మార్చే శక్తులున్న ఓ వ్యక్తి, శక్తివంతమైన మాతృస్వామ్య కుటుంబంపై పగ తీర్చుకునే నేపథ్యంలో, నిజానికి, భ్రమకు మధ్య జరిగే పోరాటంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. కేరళ జానపద కథలను హారర్ థ్రిల్లర్స్‌గా తెరకెక్కించడంలో రాహుల్ సదాశివన్ ఎక్స్‌పర్ట్.
భూతకాలం, భ్రమయుగం, డైస్ ఇరై లాంటి హారర్ సినిమాలతో మెప్పించిన రాహుల్.. మరో డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
