Fact Check : విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై క్లారిటీ - అంతా దుష్ప్రచారమే..!

Fact Check : విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై క్లారిటీ - అంతా దుష్ప్రచారమే..!

విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించిన ఒక్కరోజుకే తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.అదంతా అవాస్తవం అని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి నాణ్యతను పరీక్షించే క్రమంలో బ్రిడ్జిని డీలింక్ చేశామని అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం వాడుతున్నారని క్లారిటీ ఇచ్చారు అధికారులు. ఫ్లోటింగ్ బ్రిడ్జిని సందర్శకుల కోసం సోమవారం ప్రారంభించాల్సి ఉండగా వాతావరణంలో మార్పుల వల్ల వాయిదా వేశామని అన్నారు. ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయని, ఆ సమయాల్లో బ్రిడ్జ్ నాణ్యతను పరీక్షించటం కోసం మాక్ డ్రిల్ నిర్వహించామని, అందులో భాగంగానే బ్రిడ్జిని డీలింక్ చేశామని అన్నారు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్.

మాక్ డ్రిల్ లో భాగంగా బ్రిడ్జిని డీలింక్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అధికారులు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు జరుపుతామని అన్నారు. టూరిస్టులను మరింత ఆకర్షించే విధంగా ఫ్లోటింగ్ బ్రిడ్జిని తీర్చిదిద్దెందుకు పబ్లిక్  ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో గ్లోబల్ టెండర్లను కూడా ఆహ్వానించామని అన్నారు కమిషనర్.

ALSO READ : Fact Check : ఏప్రిల్ 19న పోలింగ్.. మే 22న కౌంటింగ్ వార్తల్లో నిజమెంత..?
 

 

ఇందులో భాగంగా సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ ఈ కాంట్రాక్ట్ దక్కించుకుందని తెలిపారు. ఈ కాంట్రాక్ట్ కోసం 15.3 లక్షల ముందస్తు చెల్లింపులు చేశారని తెలిపారు. కేరళ, కర్ణాటకలో విజయంతంగా నడుస్తున్న ఫ్లోటింగ్ బ్రిడ్జిలను పరిశీలించి నిపుణులైన కార్మికులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది సదరు సంస్థ. రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదగా ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ సోమవారం నుండి సందర్శకులకు అందుబాటులోకి రావాల్సి ఉండగా వాతావరణంలో మార్పుల కారణంగా మరో మూడురోజుల వరకు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.