ఆఫీసర్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

ఆఫీసర్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  •     ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ

గద్వాల, వెలుగు : రోడ్డు సేఫ్టీపై ప్రజలకు ఆఫీసర్లు ఆదర్శంగా ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో అరైవ్.. అలైవ్ పై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆఫీసర్లు రోడ్ సేఫ్టీని కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు.  ప్రతిరోజు ఆఫీసులకు వెహికల్స్, కార్లలో వచ్చేవారు తప్పకుండా రూల్స్ పాటించాలని చెప్పారు. 

స్పీడ్ లిమిట్ ఒక రకంగా డిజైన్ చేసి ఉంటే వాహనదారులు అధిక వేగంతో పోవడం, అకస్మాత్తుగా రహదారులపై వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంటి యజమాని మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థతి ఉంటుందన్నారు. అన్నింటిని దృష్టిలో ఉంచుకొని బాధ్యతగా డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్​రూల్స్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, అడిషనల్ ఎస్పీ శంకర్, ఆర్డీవో అలివేలు తదితరులు పాల్గొన్నారు. 

రంజాన్ కు అన్ని ఏర్పాటు చేయాలి..

రంజాన్ మాసంలో ముస్లింలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో మసీదులు,ఈద్గాల వద్ద ఏర్పాట్లపై ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి సంబంధిత ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.