ఆఫీసర్ల వెహికల్స్​ పార్కింగ్​కు అడ్డాగా చలువ పందిళ్లు

ఆఫీసర్ల వెహికల్స్​ పార్కింగ్​కు అడ్డాగా చలువ పందిళ్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు ఆఫీసర్ల వెహికల్స్​ పార్కింగ్​కు అడ్డాగా మారాయి. కొండపై ఎండలు మండుతుండడంతో ఆలయ అధికారులు ప్రసాద విక్రయ శాల నుంచి శివాలయం వద్ద ఉన్న మెట్ల దారి మీదుగా బస్ బే వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కానీ అవి భక్తులకు ఉపయోగపడట్లేదు. వాటి కింద ఆలయ ఆఫీసర్లు, వైటీడీఏ సిబ్బందికి చెందిన వాహనాలను నిలుపుతున్నారు. ఆఫీసర్ల వాహనాలు మినహా ఏ ఒక్క వెహికల్​ కొండపైకి రాకూడదని ఈఓ గీతారెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో భక్తులు కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు. తమ కోసం ఏర్పాటు చేసిన పందిళ్ల కింద బండ్లు ఎలా పార్క్​చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.