కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో పీజీ వైద్య సీట్ల భర్తీకి ప్రకటన

కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో  పీజీ వైద్య సీట్ల భర్తీకి ప్రకటన

కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో కన్వీనర్ కోటాలో పీజీ  వైద్య సీట్ల భర్తీకి అధికారులు మరో ప్రకటన జారీ చేశారు. ఈ నెల 12 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఖాళీ సీట్ల భర్తీకి మరో అవకాశం కలిపిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న  సీట్ల భర్తీకి మరో అవకాశం కలిపిస్తూ.. ఎంసీసీ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో యూనివర్శిటీ స్పెషల్ స్ట్రె (STRAY)  విడత  ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.

తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు  నమోదు  చేసుకోవచ్చు. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సిలింగ్ పూర్తి చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను చివరి విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇవాళ సాయింత్రం 5 గంటల నుండి ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల  వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇతర పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్శిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.