ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు..మూసీకి భారీగా వరద

ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు..మూసీకి  భారీగా వరద

హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  భారీ వర్షాలకు నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు  ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేశారు . రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు.  ఉస్మాన్ సాగర్  రెండు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందున  జీహెచ్ఎంసీ ఎండీ దానకిశోర్ సంబంధిత జలమండలి అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇప్పటికే   ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లను ఎత్తారు అధికారులు.  

ALSO READ :తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ ముప్పు .. రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు 

గండిపేట్ రిజర్వాయర్ కి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ  క్రమంలో  ముందు జాగ్రత్తగా రిజర్వాయర్ రెండు గేట్లను జలమండలి అధికారులు బుధవారం  ఒంటిగంటలకు ఎత్తారు.  హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు అయితే గరిష్టంగా  514.45  మీటర్లుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 513.46 మీటర్లుగా ఉంది.   ఉస్మాన్ సాగర్  గేట్లు ఎత్తివేతతో  మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.