ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే చాన్స్

ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే చాన్స్

రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పారు. రేపు చాలా చోట్ల, ఎల్లుండి మాత్రం కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రం నుండి ఆంధ్రప్రదేశ్ తీరం వరకు మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న తూర్పు పడమర ద్రోణి.. ఈ రోజు తూర్పు మధ్య బంగాళాఖాతం నుండి రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.