అధికారులు చొరవ తీసుకుంటే హాస్టళ్లలో ఇబ్బందులు ఉండవు : మంత్రి సత్యవతి రాథోడ్

అధికారులు చొరవ తీసుకుంటే హాస్టళ్లలో ఇబ్బందులు ఉండవు : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా : అధికారులు చొరవ తీసుకుని పని చేస్తే హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అధికారులు కూడా చొరవ తీసుకొని పని చేయాలని సూచించారు. కేసముద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ గురుకుల పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.

రాష్టంలో 1000 పైగా గురుకుల పాఠశాలల ద్వారా విద్యార్డులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. దేశంలో చివరిగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, అభివృద్ధిలో మాత్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. కేసముద్రంలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన గ్రామ పంచాయతీలకు కార్యాలయ భవనాలను మంజూరు చేశామన్నారు. పోడు భూముల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.