ఇక్కడే ఉంటా.. ఎటూ వెళ్లను : శివరాజ్ సింగ్ చౌహాన్

ఇక్కడే ఉంటా.. ఎటూ వెళ్లను : శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్ :  ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనప్ప టికీ.. ‘రాజ తిలకం’ కోసం ఎదురుచూస్తు న్నప్పుడు.. కొన్నిసార్లు వారి జీవితాలు ‘వన వాసం’తో ముగుస్తాయని బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని.. ఇక్కడే ఉంటానని భావోద్వే గానికి గురయ్యారు. మంగళవారం సాయంత్రం తన సొంత నియోజకవర్గం బుద్నిలోని షాగంజ్ టౌన్​లో నిర్వహించిన ఓ సభలో శివరాజ్‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌ చౌహాన్ పాల్గొని మాట్లాడారు.

‘ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. నా తోటి అక్క చెల్లెళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నేను ఎక్కడికీ వెళ్లను.. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే చస్తా” అని శివరాజ్ సింగ్ అన్నారు. సభలో కొంతమంది మహిళలు లేచి.. “భయ్యా... మీరు ఎక్కడికీ వెళ్లకండి” అని నినాదాలు చేశారు. దీంతో శివరాజ్ సింగ్ కొంత భావోద్వేగానికి గురయ్యారు. గత బీజేపీ సర్కార్ హయాంలో ప్రారంభించిన అన్ని స్కీమ్​లు, పనులు కొనసాగుతాయన్నారు.