థియేటర్ స్క్రీన్ చింపేసిన పవన్ ఫ్యాన్స్ : OG సినిమా షోలు ఆపేసిన యాజమాన్యం.. లక్షల్లో నష్టం!

థియేటర్ స్క్రీన్ చింపేసిన పవన్ ఫ్యాన్స్ : OG సినిమా షోలు ఆపేసిన యాజమాన్యం.. లక్షల్లో నష్టం!

పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ ఎన్నో అంచనాలతో ఇవాళ (సెప్టెంబర్25న) థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఓజీ చాంటింగ్ పవర్ స్టార్ అభిమానుల్లో పీక్ స్థాయిలో ఉంది. అయితే.. ఎంతటి అభిమానం అయిన అందులో.. సంబరం ఉండాలి. తమ అభిమాన నటుణ్ని చూడాలనే ఉత్సహం ఉండాలి.అంతేకానీ, భారీ అంచనాల మధ్య సినిమా రిలీజైతే.. థియేటర్ని డ్యామేజీ చేస్తారా? ఇపుడు ఇదే ప్రశ్న సగటు సినిమా ప్రేక్షకుడిలో, నెటిజన్లలో మెదులుతుంది. ఇలాంటి పిచ్చి చేష్టల వల్ల థియేటర్ యాజమాన్యాలు నష్టపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

ఓజీ నిన్న రాత్రి (సెప్టెంబర్24న) నుండే దేశవ్యాప్తంగా థియేటర్ల దగ్గర భారీ సందడితో మొదలైంది. థియేటర్ల ముందు హంగామా చేస్తూ.. డప్పులు, డీజేలు, డ్యాన్స్ లతో హోరెత్తిస్తున్నారు. అయితే, ఇదంతా థియేటర్ బయట ప్రాంగణంలో ఒకే. కానీ, సినిమా హాల్లో అంటే ఎలా కుదిరిద్ది ఆలోచించండి?

ఇవాళ ఉదయం (సెప్టెంబర్25న) బెంగళూరు లోని కేఆర్ పురం వెంకటేశ్వర థియేటర్లో OG సినిమాను ప్రదర్శిస్తున్నారు. అక్కడ షో పడకముందే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ బయట భారీ రచ్చ చేశారు. కత్తులు, కటానాలు పట్టుకుని డ్యాన్స్లు చేశారు. బెంబేలెత్తే పోయేలా లొల్లి లొల్లి చేశారు. ఇదే సమయంలో థియేటర్ లోపలికి వచ్చి స్క్రీనింగ్ అయ్యే క్షణంలోనే కత్తితో సినిమా స్క్రీన్‌ను ధ్వంసం చేశారు పవన్ ఫ్యాన్స్. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

వైరల్ అవుతున్న వీడియో గమనిస్తే.. సినిమా చూడటానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అతి ఉత్సాహంతో, కొంతమంది అభిమానులు స్క్రీన్ దగ్గరగా వెళ్లి, ఉద్దేశపూర్వకంగా కత్తితో స్క్రీన్‌ను చింపేశారు. సినిమా చూసి ఎంజాయ్ చేయాలనే వచ్చే కామన్  ఆడియన్స్ ఉత్సాహాన్ని పూర్తిగా డిస్సప్పాయింట్ చేశారు.

ఈ సంఘటనతో థియేటర్ యాజమాన్యం షో క్యాన్సల్ చేసేసింది. స్క్రీన్‌ డ్యామేజ్ అవ్వడంతో తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటుగా, మిగతా ఆడియన్స్కు షో నిలిచిపోయింది. ఈ క్రమంలో మిగతా షోలు అయిన నడపాలని థియేటర్ మేనేజ్ మెంట్ కొత్త స్క్రీన్ తెప్పించే ప్రయత్నాల్లో ఉంది. స్క్రీన్కు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని మేనేజ్ మెంట్ వెల్లడించింది. ఫ్యాన్స్ అంటే.. పిచ్చిగా ఉంటే సరిపోదు.. ఆలోచించే కామన్ సెన్స్, ఓవరాక్షన్ చేయని గుణం ఉండాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.