ఒక్క ఎగ్జామ్ తో OICLలో అసిస్టెంట్స్ జాబ్స్ .. జీతం రూ. 40 వేలు

ఒక్క ఎగ్జామ్ తో  OICLలో అసిస్టెంట్స్ జాబ్స్ .. జీతం రూ. 40 వేలు

ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ(ఓఐసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 17. 

పోస్టుల సంఖ్య: 500 (అసిస్టెంట్ (క్లాస్ III) బ్లాక్ ల్యాగ్ పోస్టులను కలుపుకొని) 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ఇంగ్లిష్​ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 21 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. లేదా 1995, జులై 31కి ముందు 2004, జులై 31 తర్వాత జన్మించిన వారై ఉండరాదు.  నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఆగస్టు 17.  
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.100. ఇతర అభ్యర్థులకు రూ.850. 
టైర్ 1 ఎగ్జామ్: సెప్టెంబర్ 07. 
టైర్ 2 ఎగ్జామ్: అక్టోబర్ 10. 
స్థానిక భాషా టెస్ట్: త్వరలో వెల్లడిస్తారు. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టైర్–1లో ప్రిలిమినరీ, టైర్–2లో మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. రెండూ కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ తర్వాత తుది ఎంపిక కోసం స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. 
పూర్తి వివరాలకు orientalinsurance.org.in 
వెబ్ సైట్ లో సంప్రదించగలరు. 

ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్  

టైర్–1లో నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామ్ కనీస అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. 100 ప్రశ్నలు ఇస్తారు. గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్–1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు(20 నిమిషాలు), సెక్షన్–2లో రీజనింగ్ 35 ప్రశ్నలు 35 మార్కులకు(20 నిమిషాలు), సెక్షన్–3లో న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు(20 నిమిషాలు)  మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. ఐఓసీఎల్ నిర్దేశించిన మేరకు అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్

టైర్–2లో నిర్వహించే మెయిన్ ఎగ్జామ్ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో ఐదు సెక్షన్లు ఉంటాయి. మొత్తం 250 ప్రశ్నలు ఇస్తారు. రెండు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్–1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 50 మార్కులకు (30 నిమిషాలు), రీజనింగ్ 40 ప్రశ్నలు 50 మార్కులకు (30 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 50 మార్కులకు (30 నిమిషాలు), కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు 50 మార్కులకు (15 నిమిషాలు) జనరల్ అవేర్ నెస్ 40 ప్రశ్నలు 50 మార్కులకు(30 నిమిషాలు) మొత్తం 250 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఐఓసీఎల్ నిర్దేశించిన మేరకు అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులను స్థానిక భాషా ప్రావీణ్య పరీక్షకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది కనీస అర్హత పరీక్ష మాత్రమే. తుది ఎంపికలో కేవలం మెయిన్ ఎగ్జామ్​లో సాధించిన మార్కులతోపాటు స్థానిక భాషా ప్రావీణ్య పరీక్షలో అర్హత పరిగణనలోకి తీసుకుంటారు.