
ఆయిల్ ఇండియా సీనియర్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 26.
పోస్టుల సంఖ్య: 102.
పోస్టులు: సూపరింటెండెంట్ 03, సీనియర్ ఆఫీసర్ 97, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ 01, హిందీ ఆఫీసర్ (అధికార భాష) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బి.టెక్/ బీఈ, ఎల్ఎల్బీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎం.టెక్/ ఎంఈ, ఎంబీఏ, పీజీడీఎంతోపాటు ఐసీఎస్ఐ, ఐసీఏఐలో రిజిస్టరై ఉండాలి. పని అనుభవం కూడా తప్పనిసరి.
వయోపరిమితి: సూపరింటెండెంట్ పోస్టుకు 32 ఏండ్లు, సీనియర్ ఆఫీసర్ 29 ఏండ్లు, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ 37 ఏండ్లు, హిందీ ఆఫీసర్ (అధికార భాష) 29 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 26.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 26.
రాత పరీక్ష: నవంబర్ 01.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.