దిగుమతి సుంకం తగ్గింపుపై.. ఆయిల్ పామ్ రైతుల ఆగ్రహం

దిగుమతి సుంకం తగ్గింపుపై.. ఆయిల్ పామ్ రైతుల ఆగ్రహం

దమ్మపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం క్రూడ్  పామ్  ఆయిల్​పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు అలపాటి రామచంద్ర ప్రసాద్, మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల ఆయిల్​ పామ్​ రైతులతో కలిపి వారు మీడియాతో మాట్లాడారు. 

విదేశాల నుంచి పామాయిల్  దిగుమతులు చౌకగా మారడం వల్ల దేశంలో ఆయిల్  పామ్  గెలల ధరలు పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా జరిగితే ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు. ఆయిల్ పామ్  రైతులకు కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించాలని, టన్నుకు రూ. 25 వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్  చేశారు. ​

రైతు ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.​