కనీపెంచిన కొడుకులే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఓ వృద్ధ జంట ఆవేదన వ్యక్తం చేశారు. వృద్దాప్యంలో తమ బాగోగులు చూడని కొడుకులపై చర్యలు తీసుకోవాలని ఆ వృద్ధ జంట వేడుకుంటున్నారు. పాయకరావుపేట దుర్గాకాలనీకి చెందిన ఆకుల వెంకటేశ్వరావు.. కుమారులు తమను పట్టించుకోవడంలేదని మీడియా ముందుకు వచ్చి గోడు వెల్లబుచ్చారు. కొడుకులను పెంచి,చదివించి సుమారు 3 కోట్ల ఆస్తులు పంచి ఇచ్చినా తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టకపొవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
