రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య.. ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలో ఘటన

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య..  ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలో ఘటన

ఘట్‌‌‌‌‌‌కేసర్‌‌‌‌, వెలుగు: మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలోని ఎన్ఎఫ్‌‌‌‌సీ నగర్‌‌‌‌ వద్ద రైలు కింద పడి భార్యాభర్తలు సూసైడ్  చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్  జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన రవికుమార్‌‌‌‌, శిరీష దంపతులు పెద్ద అంబర్‌‌‌‌పేట్‌‌‌‌ మండలం కుంట్లూరులో ఉంటున్నారు. 

గురువారం రాత్రి ఇద్దరూ ఎన్ఎఫ్‌‌‌‌సీ నగర్‌‌‌‌ రైల్వే పట్టాల వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.