పాత జర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు

పాత జర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: భారీ వర్షాలతో వరద పోటెత్తి ప్రమాదం అంచుల్లోకి వెళ్లిన కడెం ప్రాజెక్టు రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చినా తట్టుకునేలా డిశ్చార్జి కెపాసిటీ పెంచనుంది. ఇందు కోసం ప్రస్తుత స్పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేకు ఇరువైపులా 4  చొప్పున మొత్తం 8 గేట్లు  కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కడెం రిపేర్లకు సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్టును ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు సిద్ధం చేశారు.  ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా.. వాటిలో పాత తొమ్మిది గేట్ల స్థానంలో కొత్తవి కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం గేట్ల సంఖ్య 26కు చేరుకుంటుంది. డ్యాం రిహబిలిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు (డ్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లో భాగంగా రూ.16.86 కోట్లతో కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. డ్యాం సేఫ్టీ ప్యానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గతంలోనే దీనిపై పలు సూచనలు చేసింది. తాజాగా వరదలు పోటెత్తడంతో 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చినా తట్టుకునేలా పలు మార్పులతో రిపేర్లు చేయనున్నారు. నిజాం ప్రభుత్వంలో అప్పటి చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ జంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1948లో ప్రారంభమైన పనులు 1956లో పూర్తయ్యాయి. 1916లోనే కడెం ప్రాజెక్టు పనులు ప్రారంభించినా భారీ వర్షాలతో కట్ట కొట్టుకుపోయి బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. 32 ఏండ్ల అనంతరం నవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ జంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో  ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని బోథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హత్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేరడిగొండ, ఇచ్చోడ, ఉట్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాల్లో కురిసే వర్షం.. కుంటాల, పొచ్చెర జలపాతాల నుంచి వచ్చే నీళ్లు పలు వాగుల గుండా ప్రవహించి కడెం నదిలో చేరుతాయి. ఈ నీటిని ఒడిసిపట్టేలా ప్రాజెక్టు నిర్మించారు. అప్పట్లో 1.30 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జితో 9 జర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్లు ఏర్పాటు చేశారు. 1958లో ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో ఇంకో 9 ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్లు బిగించారు. ఆ స్థాయిలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో ఎప్పుడూ రాలేదు. ఈ వానాకాలంలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టుకు 5.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. డిశ్చార్జి కెపాసిటీ కేవలం 3లక్షల క్యూసెక్కులే కావడంతో ప్రాజెక్టు కొట్టుకుపోతుందని అందరూ అనుకున్నారు. కానీ వరదను తట్టుకొని నిలబడింది.

ఇయ్యాల ప్రాజెక్టును పరిశీలించనున్న ఇంజనీర్లు

భారీ వర్షాలకు కొట్టుకొచ్చిన దుంగలు తాకి 2 గేట్లు కిందికి పడిపోవడంతో పైకి ఎత్తలేకపోతున్నారు. మరో 2గేట్ల కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టుకుపోయింది. ఈ గేట్లను కిందికి దించితే పైకి ఎత్తడం అసాధ్యం.  ఇప్పుడున్న స్పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేకు రెండు పక్కలా 4చొప్పున కొత్త గేట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పాత 9 జర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్నారు. సోమవారం ఈఎన్సీలు, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు ప్రాజెక్టును పరిశీలించి గేట్ల ఏర్పాటు, ఇతర భద్రతా చర్యలపై రిపోర్టు సిద్ధం చేయనున్నారు. డ్యాం సేఫ్టీ ప్యానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బృందంతో మరోసారి పరిశీలన చేయించి అవసరమైన రిపేర్లపై తుది నివేదిక రూపొందించనున్నారు. డ్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతిపాదించిన 16.86  కోట్లకు అదనంగా ఎంత ఖర్చు చేయాలనే దానిపైనా రిపోర్టు ఇవ్వనున్నారు.