OTTలోకి వచ్చేస్తున్న సత్యదేవ్ కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTTలోకి వచ్చేస్తున్న సత్యదేవ్ కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్(Satyadev) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma). రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వీవీ గోపాల కృష్ణ(VV Gopalakrishna) తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుండే యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ వచ్చాయి. మరోపక్క.. ఐపీఎల్, ఎలక్షన్స్ హడావుడి కూడా ఉండటంతో ఈ సినిమాను ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. 

దీంతో విడుదలై వారం కూడా కాకముందే ఈ సినిమాను ఓటీటీ  విడుదల గురించి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. కృష్ణమ్మ సినిమాను మే 17 నుండి ఓటీటీలో విడుదల చేయాలని చేస్తున్నారట. ఇక కృష్ణమ్మ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుందట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని టాక్. 

ఇక కృష్ణమ్మ సినిమా కథ విషయానికి వస్తే.. సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, కృష్ణ తేజ రెడ్డి ముగ్గురు స్నేహితులు. ముగ్గురు ఆనాధలు కావడం వల్ల చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. సత్యదేవ్, లక్ష్మణ్ స్మగ్లింగ్ చేస్తుంటే.. కృష్ణ తేజ రెడ్డి ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే వారికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ అమ్మాయి రాకవల్ల వారి జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, ఆ అమ్మాయికి ప్రమాదకరమైన జబ్బు ఉంటుంది. దాని ట్రీట్మెంట్ కి చాలా డబ్బు అవసరం అవుతుంది. అందుకోసం జీవితంలో చివరి సారి స్మగ్లింగ్ చేయాలనుకుంటారు. అనుకోకుండా పోలీసులకు పట్టుబడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ముగ్గురుని పోలీసులు ఏం చేశారు? వీళ్ళ జీవితాల్లోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? అనేది కృష్ణమ్మ కథ.