Hyderabad Rains : లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లల్లోకి నీళ్లు

Hyderabad Rains : లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లల్లోకి నీళ్లు

హైదరాబాద్ సిటీలో కుండపోతగా పడుతున్న వర్షం.. గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా పడుతుంది. రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. అంతేనా.. శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకు నీళ్లు పోటెత్తాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చింతల్ ఏరియాలో వాజపేయినగర్ లో ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. దీంతో ఇంట్లోని సామాను అంతా తడిచిపోయింది. బయట మోకాళ్లలోతు నీళ్లు.. ఇంట్లో నీళ్లు దీంతో జనం అల్లాడిపోతున్నారు.

ఇంటిని వదిలేసి బయటకు వెళ్లలేని పరిస్థితి.. అలా అని ఇంట్లో ఉండలేని దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వాయిపేయినగర్ లోని వందలాది ఇళ్లల్లో ఇదే పరిస్థితి. ఆ ప్రాంతంలోని బాధితులు జీహెచ్ఎంసీకి ఫోన్ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. 

సిటీలోని కొన్ని కాలనీల్లోని అపార్ట్ మెంట్లు సెల్లార్లకు నీళ్లు చేరాయి. భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో కరెంట్ కట్ అయ్యింది. దీంతో సెల్లార్లు అన్నీ నీళ్లతో నిండాయి. వాహనాలు నీట మునిగాయి.