హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం..స్నానం బకెట్లో యాసిడ్ పోశారు.. విద్యార్థినికి తీవ్రగాయాలు

హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం..స్నానం బకెట్లో యాసిడ్ పోశారు.. విద్యార్థినికి తీవ్రగాయాలు

హైదరాబాద్ దారుణం జరిగింది. ICFAI యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేశారు గుర్తుతెలియని అగంతుకులు. స్నానం చేసే బకెట్ నీళ్లలో యాసిడ్ పోశారు. ఆ నీళ్లతో స్నానం చేసేందుకు యత్నించిన విద్యార్థిని లేఖ్య తీవ్రంగా గాయపడింది. విద్యార్థిని అరుపులు, కేకలు విన్న తోటి విద్యార్థులు ఆమెను బాత్ రూం నుంచి బయటికి తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన ఆమె పరిస్థితి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు లేఖ్య  బీటెక్ చదువుతోంది. దీంతో యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణ నెలకొంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.