51 ఏండ్ల వయస్సులో కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర

51 ఏండ్ల వయస్సులో కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర

హైదరాబాద్‭కు చెందిన 51 ఏండ్ల బొబ్బా రవీందర్ రెడ్డి సైక్లింగ్ తో రికార్డు సృష్టించారు. భారత్ సోలో పేరుతో కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు సైక్లింగ్ యాత్ర చేశారు. 22 రోజుల్లో సైకిల్ పై 3,700 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి బొబ్బా రవిందర్ రెడ్డి రికార్డు సాధించారు. ఒంటరిగా 51 ఏండ్ల వయస్సులో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కారు. యువతలో చైతన్యం, అవగాహన కోసమే ఈ యాత్ర చేశానని చెప్పారు. సెల్ ఫోన్, కంప్యూటర్ లకు అతుక్క పోయి అనారోగ్యం పాలవకూడదని ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన చెప్పారు. 

గతంలో సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్‭లో బొబ్బా రవీందర్ రెడ్డి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. సేవ్ నేషన్ స్లోగన్‭తో ఇంధనం, గ్యాస్ ఆదా చేయాలని సైక్లింగ్ యాత్ర చేశారు. గెయిల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఎలాంటి స్పాన్సర్స్ లేకుండా సొంత ఖర్చుతో సైక్లింగ్ యాత్ర చేసి ఘనత సాధించారు.