ఆర్టీఏ ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్

ఆర్టీఏ ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్

హైదరాబాద్, వెలుగు :  ఆర్టీఏ ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్​లో నిలిచిందని జిల్లా ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్​రీచ్​అవడంలో 98 శాతం సక్సెస్​అయినట్లు తెలిపారు. ఆర్టీఏకు రూ.6,972 కోట్ల ఆదాయం రాగా, ఇందులో కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(వికారాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు) నుంచే రూ.3,067 కోట్లు వచ్చాయని తెలిపారు. 

ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రూ.3,143 కోట్లు టార్గెట్​పెట్టగా, రూ.3,067 కోట్లు సాధించామని చెప్పారు. 2022–23 ఆదాయంతో పోలిస్తే 9.9 శాతం వృద్ధి రేటు సాధించినట్లు వెల్లడించారు. ఇక ప్రస్తుత జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్ది జిల్లాలో రూ.1,689 కోట్లు, మేడ్చల్–- మల్కాజిగిరిలో రూ.1,298 కోట్లు, వికారాబాద్ జిల్లాలో రూ.80 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. స్టేట్​ఆర్టీఏ ఇన్​కమ్​లో 44 శాతం ఉమ్మడి రంగారెడ్డి నుంచే ఉందన్నారు. ఈ మేరకు బుధవారం మణికొండలో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. ఆర్టీఓలు రఘునందన్, సుభాష్ చందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.