ఒలింపిక్ విజేతకు రిపబ్లిక్ డే సత్కారం

ఒలింపిక్ విజేతకు రిపబ్లిక్ డే సత్కారం

2021 ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో భారత్‌కు బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాను పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నీరజ్ చోప్రాను ఈ మెడల్ తో సత్కరించనున్నారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నీరజ్ చోప్రా కావడం గమనార్హం. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ స్వర్ణం సాధించాడు. గతంలో 2008లో బీజింగ్‌ ఒలింపిక్స్‎లో షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత నీరజ్ సాధించిన స్వర్ణమే రెండోది. నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులతో సత్కరించనున్నారు. అవార్డులలో 12 శౌర్య చక్రాలు, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, మూడు బార్ టు విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 122 విశిష్ట సేవా పతకాలు, 81 సేన పతకాలు, రెండు వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, ఎనిమిది నావో సేన పతకాలు, 14 వాయు సేన పతకాలతో విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు.

For More News..

పంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్‎గా వీడియో

తెలంగాణకు బీజేపీ, టీఆర్ఎస్ లు అవసరమా?

టీఆర్ఎస్ ప్రభుత్వంలో హమాలీలుగా నిరుద్యోగ విద్యార్థులు