
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పావో నుర్మి గేమ్స్‌లో తొలిసారి గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. ఫిన్లాండ్‌లోని టుర్క్‌లో మంగళవారం జరిగిన మెన్స్ జావెలిన్‌లో నీరజ్ ఈటెను 85.97 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్‌తో గోల్డ్ సొంతం చేసుకున్నాడు. ఐదో రౌండ్‌లో నీరజ్ ఈ దూరాన్ని అందుకున్నాడు. టోనీ కెరెనెన్ (ఫిన్లాండ్, 84.19 మీ), ఒలివర్ హీలాండర్ (83.96 మీ.) వరుసగా సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.