
టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా వెంటాడుతోంది. ఒలింపిక్స్ విలేజ్‌లో తాజాగా ఇద్దరు అథ్లెట్లు వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే అధికారుల్లో ఒకరు కరోనా బారిన పడగా.. ఇప్పుడు అథ్లెట్లకు వైరస్ సోకడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఒలింపిక్స్ విలేజ్‌లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఒలింపిక్స్‌కు వేదికగా నిలుస్తున్న టోక్యోలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. శనివారం ఒక్క రోజే 1,410 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ టోక్యోలో 1,88,108 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసుల రీత్యా ప్రస్తుతం టోక్యో నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు.