ఒలంపిక్స్ కొత్త తేదీలు ఖరారు

ఒలంపిక్స్ కొత్త తేదీలు ఖరారు

ఒలంపిక్స్ @ 2021 జులై 23-ఆగస్టు 8
ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారా ఒలంలిక్స్

టోక్యో: వాయిదా పడ్డ టోక్యో ఒలంపిక్స్ కొత్త తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ సోమవారం ప్రకటించింది. ‘కరోనా కారణంగా ఒలంపిక్స్ ను వచ్చే ఏడాది వరకు వాయిదా వేయడానికి
ఒప్పుకున్నాం. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోనే గేమ్స్ నిర్వహించాలని నిర్ణయించాం. దీని వల్ల క్వాలిఫికేషన్ టోర్నమెంట్లు నిర్వహించడంతో పాటు అథ్లెట్ల ప్రిపరేషన్స్ కు తగిన సమయం లభిస్తుంది’ అని టోక్యో గేమ్స్ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ యోషిరో మోరో ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రతిపాదించిన తేదీలకు ఒప్పుకున్నామని చెప్పారు. షెడ్యూల్ ఖరారు చేసే ముందు ఆర్గనైజర్లు అనేక టైమ్ ఫ్రేమ్స్ ను పరిశీలించారు. వచ్చే ఏడాది ఇతర ఇంటర్నేషనల్ ఈవెంట్లకు అడ్డు రాకుండా ఎండాకాలం కంటేముందే (వసంత కాలం) షెడ్యూల్ చేయాలన్న ఆలోచన కూడా చేశారు. కానీ, వేసవికే మొగ్గుచూపారు. ఇక, ఈ మెగా ఈవెంట్ ముగిసిన తర్వాత టోక్యో వేదికగా వచ్చే ఏడాది
ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు పారాలింపిక్స్ కు షెడ్యూల్ చేశారు.

For More News..

ఆసియా కప్ డౌటే!

రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి