
కశ్మీర్ ప్రజలను కేంద్రం భయపెడుతోందని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ప్రజల మధ్య ఉండాల్సిన నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కశ్మీర్ నేతలను హౌజ్ అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఖండించారు. కశ్మీర్ లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలపాల్సిన అవసరం కేంద్రానికి ఉందని ఆయన ట్వీట్ చేశారు. కశ్మీర్ లో ఏం జరగబోతోందో దేవుడికి కూడా తెలియదని మెహబూబా ముప్తీ ట్వీట్ చేశారు. కశ్మీర్ అంశంలో కేంద్రం చట్టాలను ఉల్లంఘిస్తుందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ట్వీట్ చేశారు. అయితే విపక్షాల ఆరోపణలకు కౌంటరిచ్చారు అరుణ్ జైట్లీ. కశ్మీర్ ప్రజల క్షేమమే బీజేపీ సర్కార్ లక్ష్యమన్నారు. కశ్మీర్ సమస్యకు చెక్ పడబోతుందని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.