ఖమ్మం వైరా రోడ్డులో యువతికి ఒమిక్రాన్

ఖమ్మం వైరా రోడ్డులో యువతికి ఒమిక్రాన్

ఖమ్మం జిల్లా వైరా రోడ్డులో ఓ యువతికి ఒమిక్రాన్ కన్ఫామ్ అయ్యింది. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న యువతి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. దీంతో కరోనా సోకిందనే అనుమానంతో ఖమ్మంలో ఉంటున్న తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లింది. ఈ నెల 20న ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించగా.. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో హైదరాబాద్ లోని జీనోమ్ కు శాంపిల్ పంపిచారు. దీంట్లో ఒమిక్రాన్ సోకినట్లు తేలింది.