పేరెంట్స్ వ్యాక్సిన్ వేయించుకుంటేనే పిల్లలకు స్కూల్‌లోకి ఎంట్రీ

పేరెంట్స్ వ్యాక్సిన్ వేయించుకుంటేనే పిల్లలకు స్కూల్‌లోకి ఎంట్రీ

కర్ణాటకలో ఒమిక్రాన్ భయాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు భయపటడడంతో జనంలో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటివరకు నిర్లక్ష్యంగా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండిపోయిన వారంతా వ్యాక్సినేషన్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఏ ప్రాంతంలో వ్యాక్సిన్ సెంటర్లను చూసిన ఫుల్ రష్‌గా కనిపిస్తున్నాయి. గత 10 రోజులుగా యువత వ్యాక్సిన్ కేంద్రాలకు ఎక్కువగా వస్తున్నారు. 25 శాతం మందికి వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చామని షిమోగా జిల్లా అధికారులు చెప్పారు.

పేరెంట్స్ వ్యాక్సిన్ వేయించుకుంటేనే పిల్లలకు స్కూల్‌లోకి ఎంట్రీ

మరోవైపు ఒమిక్రాన్ భయంతో వ్యాక్సినేషన్ తప్పనిసరి అని అన్ని రకాల సంస్థలు ప్రకటనలు చేస్తున్నాయి. కర్ణాటకలోని షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్‌లోకి వెళ్లాలంటే రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాల్సిందేనని ప్రకటన చేశారు. స్కూల్‌లోకి పిల్లలను అనుమతించాలన్నా సరే తల్లిదండ్రులిద్దరికీ పూర్తి వ్యాక్సినేషన్ అయ్యుండాలని ప్రభుత్వం ఆదేశించింది. లేదంటే పిల్లలను ఆన్‌లైన్‌ క్లాసులకు మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది.